is protein diet good | వ్యాయామం చేసేవారికి మార్కెట్ ప్రోటీన్ డైట్ మంచిదేనా?​

వ్యాయామం చేసేవారికి మార్కెట్ ప్రోటీన్ డైట్ మంచిదేనా?

వ్యాయామం ప్రారంభించిన ఉత్సాహవంతులు చాలామంది తమ కండరాలు త్వరగా పెరగడానికి మార్కెట్లో దొరికే ప్రోటీన్ పౌడర్ తీసుకుని వాడేందుకు ఉబలాటపడుతుంటారు. నింకానికి ప్రతి వ్యక్తికీ తన ప్రతి కిలోగ్రాము బరువుకు 1.2 గ్రాముల ప్రోటీన్ కావాలి. ఈ లెక్కన 50 కిలోల బరువున్న వ్యక్తి వ్యాయామం చేస్తుంటే అతడికి రోజూ 60 గ్రాముల ప్రోటీన్ కావాలన్నమాట. ఎవరైనా సరే… ఒక పూట చికెతో కడుపునిండా భోజనం చేస్తే అతడికి 35 గ్రాముల ప్రోటీన్ సమకూరుతుంది. అంటే రెండు పూటల భోజనంతోనే అతడికి అవసరమైన ప్రోటీన్ కంటే కాస్త ఎక్కువే (అంటే 70 గ్రాముల ప్రోటీన్) దొరుకుతుందన్నమాట. ఇంకా దీనికి తోడు చేపలు, గుడ్డు వంటి స్వాభావికమైన ప్రోటీన్ కూడా అదసంగా కూడా తీసుకోవచ్చు. మనం రోజువారీ తినే ఆహారాన్నే ఫష్కలంగా తింటూ ఉంటే మన స్వాభావికమైన ఆహారంతోనే మనకు అవసరమైన ప్రోటీన్ దొరికే అవకాశం ఉంది. ఇక శాకాహారులైతే పప్పులు, చిక్కుళ్లు వంటి నేచురల్ ప్రోటీన్ తీసుకోవడమే మంచిది. మనకు నేచురల్ గా దొరికేవి కాదని మార్కెట్లో దొరికే కృత్రిమ ప్రోటీన్ సప్లిమెంట్స్ తీసుకుంటే అవి కల్టీవి అయ్యేందుకు అవకాశాలు ఎక్కువ. ఫలితంగా దేహానికి మేలుకు బదులు కీడు చేస్తే…అసలు ఆరోగ్యమే దెబ్బతినే అవకాశం ఉంది. అయితే చాలా తీవ్రంగా వ్యాయామాలు (హార్ట్ ఆండ్ హెవీ ఎక్సర్ సైజ్) చేసేవారు ఒకవేళ ప్రోటీన్ పౌడర్స్ తీసుకోవాలనుకుంటే… తొలుత డాక్టర్‌ను కలిశాకే వాటిని వాడటం మంచిది.

















Leave a Comment

Your email address will not be published. Required fields are marked *